హైదరాబాద్‌లో ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న కొడుకు సుందర్ తల్లి మరణ వార్త తెలుసుకుని హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నాడు. తల్లి పాదాల వద్ద పడి రోదించాడు. అదే సమయంలో అతనికి గుండెపోటు వచ్చింది. బంధువులు వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగానే మార్గమధ్యలో మృతిచెందాడు. ఒకే ఇంట్లో ఇద్దరు మృతి చెందగా...కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
తల్లి మరణవార్త తట్టుకోలేక.. కొడుకు మృతి - BHONGIR
అతనికి అమ్మ అంటే ప్రాణం. నవమాసాలు మోసి పెద్ద చేసిన ఆ తల్లి మృతి చెందింది. మరణవార్త విన్న కొడుకు గుండె చెరువైంది. మాతృమూర్తి మరణం తట్టుకోలేక ఆ హృదయం ఆగిపోయింది. ఈ విషాద ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో చోటుచేసుకుంది.
తల్లి మరణవార్త తట్టుకోలేక.. కొడుకు మృతి
భూదాన్ పోచంపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఒకే రోజు తల్లి కొడుకులు మృతిచెందారు. చర్లపల్లి లలిత 72 సంవత్సరాల వృద్ధురాలు నిన్న రాత్రి బాత్రూమ్కు వెళ్లిన సమయంలో షుగర్ ఎక్కువైంది. ఇంట్లో వారు గమనించలేదు. ఆ వృద్ధురాలు కిందపడి అక్కడిక్కడే మృతి చెందింది.
హైదరాబాద్‌లో ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న కొడుకు సుందర్ తల్లి మరణ వార్త తెలుసుకుని హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నాడు. తల్లి పాదాల వద్ద పడి రోదించాడు. అదే సమయంలో అతనికి గుండెపోటు వచ్చింది. బంధువులు వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగానే మార్గమధ్యలో మృతిచెందాడు. ఒకే ఇంట్లో ఇద్దరు మృతి చెందగా...కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
sample description