రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల కోసం గ్రామాల్లో, పట్టణాల్లో పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవటానికి అందరూ సహకరించాలని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని దేవి శ్రీ గార్డెన్లో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
గ్రామాల్లో పట్టభద్రులను గుర్తించి.. వారికి ఓటరు నమోదు పట్ల అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అందుకు పార్టీ కార్యకర్తలు సహకరించాలని కోరారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు పూర్తి సన్నద్ధం కావాలన్నారు. ఈ సందర్భంగా కొత్త రెవెన్యూ చట్టం పట్ల ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇదీచూడండి.. కేటీఆర్ అబద్ధాలు చెప్పుడు మానాలి : ఎంపీ అర్వింద్