యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో గల శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోవడానికి రామగుండు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ యాదాద్రి క్షేత్రానికి చేరుకున్నారు. ఆయన దర్శనానికి వెళ్లిన సమయంలో స్వామి వారి నిత్య కల్యాణం జరుగుతున్నది. ఎమ్మెల్యే చందర్ని లోపలికి పంపిచక పోవడం వల్ల ఆయన ఆలయ అర్చకుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. వారితో వాగ్వాదానికి దిగారు. గమనించిన ఆలయ అధికారులు స్వామివారి కల్యాణాన్ని కొంతసేపు నిలిపివేసి, ఆలయంలో పాటిస్తున్న కొవిడ్ నిబంధనల గూర్చి, భక్తులకు అమలు చేస్తున్న లఘుదర్శనం గురించి వివరించారు.
స్వామివారికి ప్రతి నిత్యం పూజలు జరిపే ఆన్లైన్లో బుక్ చేసుకున్న భక్తుల కోసం పరోక్ష పద్ధతి ద్వారా జరుపుతున్నట్టు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేను శాంతింపజేశారు. స్వామి దర్శనం చేయించారు. ఆలయ అర్చకులతో ఎమ్మెల్యేకు ఆశీర్వచనం చేయించారు.
ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో కలిసి బాలాలయంలోని స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించి పూజలు చేశారు. అర్చకులు ఆయనకు స్వామి వారి, తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
ఇవీ చూడండి: దిల్లీలో ఐటీ మంత్రి కేటీఆర్.. కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పూరీతో భేటీ