ETV Bharat / state

నియోజకవర్గ సాగునీటి లభ్యతపై చర్చించిన ఎమ్మెల్యే - irrigation

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్​లో జరిగిన సమావేశంలో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్​రెడ్డి పాల్గొని నియోజకవర్గంలో సాగునీటి లభ్యతపై అధికారులతో చర్చించారు. ఆలేరు నియోజకవర్గానికి సాగునీటిని అందించేందుకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు.

mla gongidi sunitha mahender reddy spoke about irrigation in aleru constituency
నియోజకవర్గ సాగునీటి లభ్యతపై చర్చించిన ఎమ్మెల్యే
author img

By

Published : May 30, 2020, 7:38 PM IST

ఆలేరు నియోజ‌క‌వ‌ర్గానికి సాగునీటిని అందించేందుకు ఆరు అవ‌కాశాల‌ను వినియోగించుకుని 8 మండ‌లాల‌ల‌కు సాగునీటిని అందించే ల‌క్ష్యంగా ముందుకు పోతున్నామ‌ని ప్ర‌భుత్వ విప్ గొంగిడి సునీత మహేంద‌ర్‌రెడ్డి తెలిపారు. యాదాద్రి భువ‌న‌గి‌రి జిల్లా క‌లెక్టరేట్​లో జ‌రిగిన స‌మావేశంలో ఆమె పాల్గొని నియోజ‌క‌వ‌ర్గ సాగునీటి లభ్య‌తపై అధికారులతో చర్చించారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు 15, 16 ప్యాకేజీలో భాగంగా నిర్మితమ‌వుతున్న కాలువల ద్వారా బొమ్మ‌ల‌రామారం, తుర్క‌ప‌ల్లి, రాజాపేట‌, యాద‌గిరిగుట్ట‌, ఆలేరు మండ‌లాల‌కు సాగునీరు అందించే వీలుందని‌ ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి అన్నారు. అశ్వ‌రావుప‌ల్లి కాలువల ద్వారా ఆలేరు మండ‌లంలోని 6 గ్రామాల‌కు, న‌వాబ్ రిజ‌ర్వాయ‌ర్ ద్వారా గుండాల మండ‌లానికి సాగునీరు అందుతుంద‌న్నారు.

ఆలేరు నియోజ‌క‌వ‌ర్గానికి ఉన్న సాగునీటి సౌకర్యాల‌న్నింటినీ వాడుకుని నియోజకవర్గంలోని చెరువుల‌ను నింపేందుకు ప్ర‌ణాళిక‌ల‌ను త‌యారు చేస్తున్నామ‌న్నామని ఆమె స్పష్టం చేశారు. చెరువుల స్థితిగ‌తులు, చెరువులకు వెళ్లేందుకు ఉండాల్సిన ఫీడ‌ర్ చాన‌ళ్ల‌ను గుర్తించేందుకు ఆయా గ్రామాల ప్ర‌జాప్ర‌తినిధుల‌తో స‌ర్వే జ‌రుపుతున్నామ‌న్నారు. చెరువుల్లో ఉన్న ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ భూముల‌ను గుర్తించి వివ‌రాలు ఇవ్వాల‌ని అధికారులను ఆదేశించామ‌న్నారు. నీటిని నింపేందుకు చెరువుల‌కు కావాల్సిన సౌల‌భ్యం గుర్చి తెలుసుకునేందుకు ప్ర‌జాప్ర‌తినిధులు, అనుభ‌వ‌జ్ఞుల‌తో చ‌ర్చ జ‌రుపుతున్న‌ట్లు ఆమె తెలిపారు.

ఆలేరు ప్రాంతానికి కాళేశ్వ‌రం జలాల‌ను అందిస్తామ‌ని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ నేప‌థ్యంలో చెరువుల‌ను పున‌రుద్ద‌రించేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి చెప్పారు. ముఖ్యంగా పెంబ‌ర్తి చెరువులోకి నీరు వ‌స్తే ఆలేరు ప్రాంతానికి నీటి స‌మస్య తీరుతుందని ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు అభిప్రాయ‌ప‌డ్డార‌ని తెలిపారు. కొన్ని చెరువుల్లోకి కాలువ‌లను నిర్మాణం చేయాల‌ని ప్ర‌తిపాధ‌న‌లు వచ్చాయ‌ని ఆమె పేర్కొన్నారు. నియోజ‌క‌వ‌ర్గ వ్యాప్తంగా చెరువుల‌ను పునురుద్ద‌రిస్తామ‌ని చెప్పారు. ఇందుకు కావాల్సిన భూసేక‌ర‌ణకు జిల్లా స్పెష‌ల్ డిప్యూటీ క‌లెక్ట‌ర్ సానుకూలంగా ఉన్నార‌ని ఎమ్మెల్యే సునీత తెలిపారు. 8 మండ‌లాల్లోని చెరువులు, కాలువ‌ల నిర్మాణాలు పూర్తి చేసుకుని గోదావ‌రి జ‌లాల‌ను సంపూర్ణంగా వినియోగించుకునేలా ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు చేపడుతున్నామని ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి తెలిపారు.

ఇవీ చూడండి: జూన్ 8 వరకు ధాన్యం కొనుగోలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.