నూతన సాగు చట్టాలతో రైతుకు మద్దతు ధర లభించదని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత తెలిపారు. కార్పొరేట్ సంస్థలు నిర్ణయించిన ధరలకే అమ్మాల్సి ఉంటుందన్నారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని గౌరాయిపల్లి గ్రామంలో పొలాలను సందర్శించారు. మహిళలతో కలిసి వరి నాట్లు వేశారు. అనంతరం రైతులతో ముచ్చటించారు.
నూతన సాగు చట్టాలతో అన్నదాతల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా రైతులంతా మోదీ పాలనను వ్యతిరేకిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గడ్డమీది రవీందర్ గౌడ్, రైతు సమితి కో ఆర్డినేటర్ జిన్నా మాధవరెడ్డి, సర్పంచ్ సిరికొండ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి : అనపర్తి రాజకీయం.. సత్యప్రమాణాలతో గరం గరం