సీఎం కేసీఆర్ పుట్టినరోజున ప్రతి కార్యకర్త చెట్లు నాటాలని ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆలేరు నియోజకవర్గంలో 80వేలకుపైగా తెరాస సభ్యత్వాలు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. యాదగిరిగుట్టలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు.
నియోజకవర్గంలో 80 వేల సభ్యత్వ నమోదు లక్ష్యంగా పెట్టుకుని కార్యక్రమం ప్రారంభించుకున్నాం అన్నారు. ఆశించిన స్థాయి కంటే ఎక్కువ సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారని పేర్కొన్నారు. కేసీఆర్, కేటీఆర్ ఇచ్చిన టార్గెట్ పూర్తి చేస్తామనే విశ్వాసం కలిగిందని తెలిపారు.
సంక్షేమ పథకాలు చూసి ప్రజలందరూ తెరాస వైపు చూస్తున్నారని డీసీసీబీ ఛైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. 2 వేల కోట్లతో సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్న యాదాద్రి దేశానికే తలమానికంగా నిలుస్తుందని పేర్కొన్నారు. మండల, గ్రామనికో ఇంచార్జ్ చొప్పున నియమించి సభ్యత్వాలు ఫిబ్రవరి 20లోపు పూర్తి చేస్తామని తెలిపారు.
ఇదీ చూడండి: 'కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం చెప్పేదంతా అబద్ధం'