రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే గాదరికిశోర్ కుమార్ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు, పాటిమట్ల, అడ్డగుడూరులో రూ.22 లక్షల వ్యాయంతో నిర్మించతలపెట్టిన రైతు వేదిక భవనాలకు శంకుస్థాపన చేశారు. సీఎం కేసిఆర్ రైతు పక్షపాతి అని... అనునిత్యం రైతుల సంక్షేమం కోసం పాటుపడుతుంటారని పేర్కొన్నారు. అందులో భాగంగానే దేశంలో ఎక్కడలేని విధంగా రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలను ప్రవేశపెట్టాడన్నారు.
రైతులను ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో రైతు వేదిక భవనాలను ప్రభుత్వం నిర్మిస్తుందన్నారు. ఈ భవనాలను వినియోగించుకొని ఎప్పడికప్పుడు వ్యవసాయంలో మార్పులు చేస్తూ రైతులు అభివృద్ధి చెందాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్ఫెడ్ ఛైర్మన్ కంచర్ల రామకృష్ణా రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్, అడ్డగుడూరు ఎంపీపీ దర్శనాలు అంజయ్య తదితరులు పాల్గొన్నారు.