ETV Bharat / state

Yadadri Development: 'తిరుమల తరహాలో యాదాద్రిలో వసతులు' - యాదగిరి గుట్ట వార్తలు

Yadadri Development: యాదాద్రి ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి ఆకాంక్షించారు. తిరుమల తరహాలో యాదాద్రిలో బ్రేక్, వీఐపీ దర్శనాలకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆలయ బోర్డు నిర్వహణకు ఐఏఎస్​ అధికారిని నియమించే ఆలోచన ఉందన్నారు.

yadadri temple
yadadri temple
author img

By

Published : Mar 30, 2022, 7:21 AM IST

Yadadri Development: దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం స్థాయిలో అన్నిరకాల వసతులు కల్పిస్తామని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. యాదాద్రిలో మిగిలిన పనులన్నింటినీ వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆలయ అభివృద్ధి, పెరిగిన సదుపాయాలు, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఐఏఎస్​ అధికారి ఆధ్వర్యంలో నిర్వహణ జరగాలన్న అభిప్రాయం ఉందని మంత్రి చెప్పారు. మహత్కార్యంలో తానూ భాగస్వామి కావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

తిరుమల తరహాలో యాదాద్రిలో వసతులు కల్పిస్తాం: మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి

ఇదీచూడండి: ఇల వైకుంఠం యాదాద్రికి తరలివస్తున్న భక్తజనులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.