బల్దియా ఎన్నికల ఫలితాలు తెరాసకు అనుకూలంగా ఏకపక్షంగా రాబోతున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జోస్యం చెప్పారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆయనకు ప్రత్యేక ఆశీర్వచనం చేశారు. అనంతరం కొండపైన ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించి, పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానానికి ధీటుగా యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మిస్తున్న సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని ఎర్రబెల్లి అన్నారు. కాకతీయులు, శ్రీకృష్ణదేవరాయలు ఆలయాలు నిర్మించారని పాఠ్య పుస్తకాల్లో చదువుకున్నామని, కానీ యాదాద్రిని నిర్మిస్తున్న సీఎం కేసీఆర్ను ప్రత్యక్షంగా చూస్తున్నామన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి, మత ఘర్షణలు సృష్టించి తెలంగాణలో చిచ్చుపెట్టాలని చూశారని... అలాంటి వారిని ఆ భగవంతుడే శిక్షిస్తాడని వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి: గ్రేటర్ పోరు: నగరవాసుల బాధ్యతకు బద్ధకపు ముసుగు...!