యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఆర్టీసీ డిపో కార్మికులకు, సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. రోటరి క్లబ్ ఆఫ్ భువనగిరి ఆధ్వర్యంలో డా. ఎంపల్ల బుచ్చిరెడ్డి సొంత నిధులతో ఈ కార్యక్రమం జరిగింది.
మొత్తం రూ. 20 వేలతో 450 మాస్కులు, 200 శానిటైజర్లను ఎంపల్ల వెంకట్ రెడ్డి, ఇరుకుల్ల రామకృష్ణ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ శ్రీ తెప్పల రఘు, కోశాధికారి బండారు బాలరాజు, క్లబ్ డైరెక్టర్స్ బుస్సా రమేశ్, బచ్చు నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఈ సమావేశాల్లోనే అసెంబ్లీ ముందుకు.. కొత్త రెవెన్యూ చట్టం!