ETV Bharat / state

కేసీఆర్ చిత్రపటానికి మందుల సామేలు పాలాభిషేకం

రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పాలిట ఆపద్బాంధవుడయ్యాడని తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేలు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం ధర్మారంలో… ముఖ్యమంత్రి కేేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేేేశారు.

కేసీఆర్ చిత్రపటానికి మందుల సామేలు పాలాభిషేకం
కేసీఆర్ చిత్రపటానికి మందుల సామేలు పాలాభిషేకం
author img

By

Published : Sep 12, 2020, 9:43 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం ధర్మారంలో… రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేలు… ముఖ్యమంత్రి కేేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేేేశారు. వీఆర్ఓ వ్యవస్థను రద్దుచేసి, అసెంబ్లీలో నూతన చట్టం ఏకగ్రీవంగా ఆమోదం పొందడంతో గ్రామగ్రామాన రైతులు సంబరాలు జరుపుకుంటున్నారన్నారు. కాళేశ్వరం జలాలతో తుంగతుర్తి నియోజకవర్గం సస్యశ్యామలమైందని సామేలు అన్నారు.

బునాదిగాని కాల్వ, పిల్లాయపల్లి, ధర్మారం కాల్వ పూర్తి చేసి మోత్కూరు, అడ్డగూడూరు మండలాలకు బస్వాపూర్ రిజర్వాయర్ ద్వారా సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్టు తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి దయాాకర్​ రావు చొరవతో… ధర్మారం సమీపంలోని బిక్కేరు వాగుపై రూ. 8.50 కోట్లతో చెక్ డ్యాం ముజూరైనట్టు వెల్లడించారు. ఈ వాగు పారడంతో అడ్డగూడూరు మండలంలో సుమారు 7వేల ఎకరాలకు సాగులోకి వస్తుందన్నారు.

ధర్మారం చెరువును రిజర్వాయర్​గా మారిస్తే ధర్మారం, లక్ష్మీదేవి కాల్వ గ్రామాల పరిధిలో సుమారు 4 వేల ఎకరాలు సాగవుతుందన్నారు. అంతేకాకుండా… అడ్డగూడూరు, గోవిందా పురం, గట్టుసింగారం గ్రామాల్లో భూగర్బజలాలు పెరుగుతాయన్నారు. ఈ సమావేశంలో తెరాస గ్రామశాఖ అధ్యక్షుడు తాడోజు లక్ష్మణాచారి, జక్కుల భాగ్యారావు, పోలినేని సోమయ్య, యూత్ అధ్యక్షుడు మందుల సైదులు, మందుల విజయ్, అంజయ్య, నరేష్, కనకయ్య, పద్మయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.