రాజ్యాధికార సాధనతోనే దళితుల అభివృద్ధి : మందకృష్ణ మాదిగ - ఎమ్మార్పీఎస్
రాజ్యాధికార సాధనతోనే దళితుల అభివృద్ధి సాధ్యమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాకలో ఆది జాంబవంతుడి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేసి మహాజన రాజ్యాధికార రథాన్ని ప్రారంభించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక ఆది జాంబవంతుడి ఆలయాన్ని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సందర్శించారు. రాజ్యాధికారం సాధిస్తేనే ఈ దేశంలో దళితులు అభివృద్ధి చెందుతారని ఆయన అన్నారు.
కొన్ని రాజకీయ పార్టీలు దళితులను ఎన్నికల సమయంలో వాడుకొని మిగతా సమయాల్లో మోసం చేస్తున్నాయన్నారు. రాజ్యాధికార సాధనకు ఎంతటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కొలనుపాకలోని ఆదిజాంబవంతుని ఆలయం నుండి మహాజన రాజ్యాధికార రథాన్ని ఆయన ప్రారంభించారు. ఈకార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు తాటికాయల నరేందర్ మాదిగ, నల్ల చంద్రస్వామి మాదిగ, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కొత్త విద్యా విధానం... కొన్ని సవాళ్లు!