ETV Bharat / state

పార్శిల్‌లో మృతదేహం - ఇంకా కొలిక్కి రాని కేసు - కారులో వచ్చిన మహిళ ఎవరు? - DEAD BODY IN PARCEL

పార్శిల్‌లో శవం కేసులో మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు - నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం

West Godavari Dead Body In Parcel Case Update
West Godavari Dead Body In Parcel Case Update (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Updated : 4 hours ago

West Godavari Dead Body In Parcel Case Update : చెక్కె పెట్టెలో శవం కేసు ఇంకా కొలిక్కి రాలేదు. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామానికి చెందిన సాగి తులసి ఇంటికి గృహ నిర్మాణ సామాగ్రి పార్సిల్‌ పేరిట వచ్చిన చెక్క పెట్టెలో శవం బయటపడిన విషయం తెలిసిందే. ఈ కేసులో అనుమానితుడిగా భావిస్తున్న తులసి సోదరి భర్త శ్రీధర్ వర్మ అచూకీ నేటికీ తెలియలేదు.

ఘటన జరిగిన రోజు భీమవరం నుంచి తాడేపల్లిగూడెం మార్గంలో సాగిపాడు వద్ద ఎరుపు రంగు కారులోంచి ముఖానికి మాస్క్ ధరించిన ఒక మహిళ దిగింది. అక్కడి నుంచి పిప్పరకు చెందిన ఆటోడ్రైవర్‌తో పెట్టెను యండగండి తీసుకెళ్లాలని కిరాయికి పురమాయించి వెళ్లిపోయింది. అనంతరం ఆమె ఎక్కిన కారు ఎటువైపు వెళ్లిందనేది గుర్తించేందుకు ప్రధాన రహదారులపై ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.

పరువు హత్య! - ఇంటికి వస్తే ఘనంగా పెళ్లి చేస్తామన్నారు - చంపేసి పారిపోయారు!!

ఆ పెట్టె తులసి ఇంటికి చేరాక అందులో మృతదేహం ఉన్నట్లు గుర్తించగానే ఆమె మరిది శ్రీధర్‌ వర్మ పరారయ్యాడని, అతడు కూడా ఎరుపురంగు కారులోనే పారిపోయినట్లుగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. మరోవైపు ఆ మహిళతో శ్రీధర్‌ వర్మకు సన్నిహిత సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. పోస్టుమార్టం నివేదికను పరిశీలిస్తే అతడిని హత్య చేసినట్లుగా తేలిందని ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి వెల్లడించారు. కేసు విషయం ఐజీ అశోక్‌ కుమార్‌ భీమవరంలోని ఎస్పీ కార్యాలయంలో ఆదివారం సమీక్షించారు. అలాగే చెక్క పెట్టెలోని శవం ఎవరిదో గుర్తుపట్టడం కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సమీప ప్రాంతాల్లో 30-40 సంవత్సరాల మధ్య పురుషులు అదృశ్యమైతే తమకు తెలియజేయాలని పోలీసులు కోరారు.

అసలేం జరిగింది : ఆంధ్రప్రదేశ్‌ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామంలో గురువారం రాత్రి పార్సిల్‌ కలకలం రేపింది. తులసి అనే మహిళకు వచ్చిన ఇంటి నిర్మాణా సామాగ్రి వచ్చాయనుకుంటే అందులో శవం కనిపించడం అందరూ ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. తులసి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

5 గుంటల భూమి కోసం దారుణానికి ఒడిగట్టిన తమ్ముడు, మరదలు - అసలు ఏమైందంటే?

Last Updated : 4 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.