ETV Bharat / offbeat

కనుబొమ్మలు పల్చగా ఉన్నాయని బాధపడుతున్నారా? - రోజూ ఇలా చేస్తే ఒత్తుగా పెరుగుతాయట! - BEST TIPS FOR THICKER EYEBROWS

ముఖసౌందర్యంలో కనుబొమ్మలదీ కీలకపాత్రే - ఇలా చేస్తే ఒత్తుగా, ఆరోగ్యంగా పెరుగుతాయంటున్న నిపుణులు!

BEST TIPS FOR THICKER EYEBROWS
NATURAL REMEDIES FOR THICK EYEBROWS (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

These Oils to Help You Grow Thick Eyebrows : కళ్లతో పాటు కనుబొమ్మలూ చూడగానే ఎదుటివారిని ఆకట్టుకునేలా ఉంటేనే ముఖం మరింత అందంగా కనిపిస్తుంది. అవి ఒత్తుగా, నల్లగా ఉన్నప్పుడే మోము అందం ఇనుమడిస్తుంది. కాబట్టి, కనుబొమ్మలు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరగాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలంటున్నారు సౌందర్య నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఆలివ్ ఆయిల్ : కనుబొమ్మల ఎదుగుదలకు ఆలివ్ నూనె చాలా బాగా తోడ్పడుతుంది. ఇందులో ఉండే విటమిన్‌- ఎ, ఇ, ఇతర పోషకాలు వెంట్రుకలకు కావాల్సిన దృఢత్వాన్ని అందించి అవి రాలిపోకుండా చేస్తాయి. కాబట్టి, డైలీ రెండు చుక్కల ఆలివ్ నూనెను కనుబొమ్మలపై రాసి మర్దన చేస్తే మంచి ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు.

కొబ్బరి నూనె : ఇది కండిషనర్‌లానే కాకుండా మాయిశ్చరైజర్‌లానూ పనిచేస్తుంది. ఈ నూనెలో ఉండే విటమిన్‌ ఇ, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్యాటీ యాసిడ్స్ వెంట్రుకలు ఆరోగ్యంగా ఎదిగేందుకు తోడ్పడతాయి. అందుకే రాత్రి పడుకునే ముందు కొద్దిగా కొబ్బరినూనెతో కనుబొమ్మలను మసాజ్ చేసుకోవడం ద్వారా బెటర్ రిజల్ట్ కనిపిస్తుందంటున్నారు.

ఆముదం : రోజూ కాస్తంత ఆముదాన్ని నిద్రపోయే ముందు కనుబొమ్మల చుట్టూ రాయండి. ఇలా చేయడం వల్ల కనుబొమ్మలు ఒత్తుగా పెరుగుతాయి. ఈ చిట్కా కూడా చక్కగా పనిచేస్తుందంటున్నారు.

ఆల్మండ్ ఆయిల్ : ఈ నూనెలో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, బాదం నూనెతో రెగ్యులర్​గా కాసేపు మసాజ్ చేసుకోవాలి. నెక్ట్ డే మార్నింగ్ చల్లటి నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం ద్వారా కనుబొమ్మలు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది!

ఇవి కూడా..

  • రాత్రి నానబెట్టిన మెంతుల్ని ఉదయాన్నే పేస్ట్ చేసి కనుబొమ్మలపై అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే ఫలితం కనిపిస్తుందంటున్నారు.
  • అదేవిధంగా, కనుబొమ్మలపై నిమ్మ చెక్కతో రుద్దినా ఆ ప్రదేశంలో వెంట్రుకలు దట్టంగా పెరుగుతాయట.
  • ఉల్లిపాయలో సల్ఫర్ అధిక మొత్తంలో ఉంటుంది. కాబట్టి ఇది రక్త ప్రసరణ బాగా జరిగేలా ప్రేరేపిస్తుంది. క్రమం తప్పకుండా ఉల్లిపాయ రసాన్ని కనుబొమ్మల చుట్టూ రాయడం వల్ల అవి ఒత్తుగా పెరిగేలా చేయవచ్చంటున్నారు.
  • ఒక చిన్న బౌల్​లో పాలు తీసుకొని అందులో కాటన్‌ను ముంచి కనుబొమ్మల చుట్టూ అద్దాలి. ఇలా తరచూ చేస్తుంటే కొద్ది రోజులకు కనుబొమ్మలు ఒత్తుగా రావడం గమనించవచ్చు.
  • ఈ టిప్స్​తో పాటు రోజూ తగినంత వాటర్ తాగాలి. దీని వల్ల శరీరంలోని విషతుల్యాలు బయటకు వెళ్లి పోవడమే కాకుండా.. రక్తప్రసరణ బాగా జరగడానికి సహాయపడుతుందంటున్నారు నిపుణులు.

ఇవీ చదవండి :

మీ ఇంట్లోనే ఐబ్రోస్ థ్రెడింగ్ - ఇలా ఈజీగా చేసుకోండి!

చలికాలంలో కుదుళ్లలో దురద ఇబ్బంది పెడుతోందా ? - రోజూ ఇలా చేస్తే అంతా సెట్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.