TTD Inaugurates modernize Sub enquiry for Devotees : తిరుమలలో శ్రీవారి భక్తులు సులభంగా వసతి పొందేలా టీటీడీ అదనపు చర్యలు చేపట్టింది. ఈ మేరకు తిరుమలలోని జీఎన్సీ (Garudadri Nagar Cottage) సబ్ ఎంక్వైరీ కార్యాలయాలను ఆధునీకరించింది. కరెంట్ బుకింగ్‌లో భాగంగా గదులు పొందే భక్తులు ఇబ్బందులు పడకుండా సబ్ ఎన్‌క్వైరీలో నగదు చెల్లించి వసతి సౌకర్యం పొందవచ్చని టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. శ్రీవారి దర్శనం కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు సులభంగా వసతి పొందేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ఇందులో భాగంగా ఇటీవల అదనపు ఈఓ వెంకయ్యచౌదరి, జేఈఓ గౌతమి, సీవీఎస్వో శ్రీధర్‌తో కలిసి ఈవో శ్యామలరావు జీఎన్సీ సబ్ ఎంక్వైరీ కార్యాలయానికి పూజ చేసి ప్రారంభించారు. తిరుమలలోని అన్ని వసతి గదులు, విశ్రాంతి గృహాలు వద్ద సర్వే చేసి ఇంకా మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు ఈవో శ్యామలరావు వివరించారు. తిరుమలలోని 42 సబ్ ఎంక్వైరీ కార్యాలయాలను ఆధునీకరిస్తున్నామని వెల్లడించారు. కరెంట్ బుకింగ్‌లో భాగంగా గదులు పొందే భక్తులు ఇబ్బందులు పడకుండా వారు పొందిన కాటేజీకి సంబంధించిన సబ్ ఎంక్వైరీలో నగదు చెల్లించే వసతి సౌకర్యం తీసుకునేలా ఏర్పాటు జరగుతున్నాయని వెల్లడించారు.
ఎప్పటికప్పుడు లోటుపాట్లు సరిచేసుకుంటాం : టెక్నాలజీ వినియోగించి భక్తులకు మరింత మెరుగైన వసతి సదుపాయం కల్పించడమే తమ లక్ష్యమని అదనపు ఈవో వెంకయ్య చౌదరి అన్నారు. ఎప్పటికప్పుడు లోటుపాట్ల కూడా సరిచేసుకుంటామని తెలిపారు. కరెంట్ రూమ్ బుకింగ్‌లో సెంట్రల్ ఎంక్వైరీ కార్యాలయంపై అధిక భారం పడుతుండటంతో గదుల కేటాయింపు ప్రక్రియను డీసెంట్రలైజ్ చేసినట్లు పేర్కొన్నారు. సబ్ ఎంక్వైరీ కార్యాలయాల వద్ద గదులు పొందడం, ఖాళీ చేయడం సులభం అవుతుందని వివరించారు.
భక్తుల కోసం ఛాట్‌బాట్ : మరోవైపు శ్రీవారి భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేలా ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వినియోగించుకుంటామని టీటీడీ ఈవో శ్యామలరావు పేర్కొన్నారు. ఈ మేరకు త్వరలోనే ఛాట్‌బాట్‌ను అందుబాటులోకి తెస్తామని వివరించారు. కచ్చితమైన భక్తుల సంఖ్యను లెక్కించేందుకు ఫేస్ రెకగ్నిషన్ టెక్నాలజీని అందించేందుకు రిలయన్స్ సంస్థ ముందుకొచ్చిందని తెలిపారు. ఇందులో గూగుల్ కూడా భాగస్వామ్యం కల్పిస్తామని పేర్కొన్నారు.
ఎస్‌ఈడీ, ఎస్‌ఎస్‌డీతో పాటు సలహామండలి అనుమతితో పరిశీలిస్తున్నామని టీటీడీ ఈఓ శ్యామలరావు తెలిపారు. శ్రీవారి భక్తులకు సేవలు అందించే దిశగా వర్చువల్ క్యూలైన్‌లో దర్శన టైమింగ్‌ను తగ్గించేందుకు ముగ్గురు టీసీఎస్ ఎక్స్‌పర్ట్‌లను ఆరు నెలలపాటు టీటీడీలో ఉంటూ పరిశీలించాలని ఆహ్వానించామని చెప్పారు. మాడవీధుల్లో ఎక్కువ మంది భక్తులు శ్రీవారి వాహనసేవల దర్శనం చేసుకునేలా ఆగమ సలహామండలి అనుమతితో పరిశీలిస్తున్నామని తెలిపారు.
హాట్ కేకుల్లా తిరుమల శ్రీవాణి దర్శన టికెట్లు - ఉదయం నుంచే భక్తుల బారులు
శ్రీవారి భక్తులకు అలర్ట్ - రేపే 'మార్చి 2025' ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల