New Updated Honda Activa 125: ప్రముఖ టూ-వీలర్ తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ తన పాపులర్ యాక్టివా 125 స్కూటర్ అప్డేటెడ్ వెర్షన్‌ను లాంఛ్ చేసింది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా సరికొత్త అప్డేట్లతో కంపెనీ దీన్ని తీసుకొచ్చింది. ఈ కొత్త యాక్టివా 125 సిగ్నేచర్ సిల్హౌట్‌తో వస్తుంది. సరికొత్త కాంట్రాస్టింగ్ బ్రౌన్ సీట్లు, లోపలి ప్యానెల్‌లతో ఇది ఆకర్షణీయంగా ఉంది. దీనిలోని వ్యూ మోడ్ కస్టమర్లను మరింత ఆకట్టుకుంటుంది. కంపెనీ దీని ఎంట్రీ-లెవెల్ వేరియంట్ రూ. 94,422(ఎక్స్-షోరూమ్) ధరతో తీసుకొచ్చింది.
న్యూ టచ్ ఫర్ హోండా యాక్టివా: ప్రస్తుతం హోండా యాక్టివా 125లో LCD డిస్ప్లే ఉండగా.. ఈ కొత్త మోడల్ 4.2-అంగుళాల TFT డిస్‌ప్లేను కలిగి ఉంది. దీని స్పెషాలిటీ ఏంటంటే.. ఈ స్కూటర్‌ను 'హోండా రోడ్‌సింక్' యాప్‌కి కనెక్ట్ చేయొచ్చు. ఇది కాల్ అలర్ట్, నావిగేషన్ అసిస్ట్ వంటి ఫీచర్లతో వస్తుంది.
అంటే స్మార్ట్‌ఫోన్‌కు వచ్చే కాల్స్, టెక్స్ట్ మెసెజ్‌లను కూడా ఈ స్క్రీన్ ద్వారా తెలుసుకోవచ్చు. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో మొబైల్ ఫోన్‌ను 'హోండా రోడ్ సింక్ యాప్'కు కనెక్ట్ చేయడం ద్వారా ఈ ఫీచర్ల యాక్సెస్ పొందొచ్చు. వీటితోపాటు ఈ స్కూటర్లో USB టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. ఇక ప్రస్తుతం మార్కెట్లో ఈ TFT డిస్ప్లేతో టాప్ స్మార్ట్ కనెక్ట్ వేరియంట్ 125cc ఏకైక స్కూటర్ 'TVS జూపిటర్ 125'. దీని ధర రూ.90,721.
ఇంజిన్: అప్డేటెడ్ OBD2B ఫీచర్లతో ఈ కొత్త హోండా స్కూటర్ వస్తుంది. ఇది OBD2B స్టాండర్డ్ ఇంజిన్ కఠినమైన ఉద్గార నిబంధనలను కలిగి ఉంది. ఇది హోండా స్కూటర్లో ఇడ్లింగ్ స్టాప్ సిస్టమ్ ఫీచర్‌ను కూడా అందిస్తుంది. దీని సాయంతో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద మీ స్కూటర్ ఇంజిన్ ఆటోమేటిక్‌గా ఆఫ్ అయిపోతుంది. దీంతో వినియోగదారుల వెహికల్ ఇంధన సామర్థ్యం మెరుగవుతుందని కంపెనీ చెబుతోంది. ఇందులో 123.9cc ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ అందించారు. ఇది 8.4hp పవర్, 10.5Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాక ఈ స్కూటర్లో మోటార్ స్టార్ట్-స్టాప్ సిస్టమ్ కూడా ఉంది.
వేరియంట్స్:
- DLX
- H-Smart
కంపెనీ ఈ కొత్త హోండాను ప్రస్తుతం రెండు వేరియంట్లలో మాత్రమే తీసుకొచ్చింది. భవిష్యత్తులో ఫ్రంట్ డ్రమ్ బ్రేక్‌ల వంటి ఫీచర్లతో మరిన్ని వెర్షన్లను ప్రారంభించొచ్చు.
కలర్ ఆప్షన్స్: ఈ స్కూటర్ మార్కెట్లో 6 ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
- బ్లాక్
- మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్
- పర్ల్ డీప్ గ్రౌండ్ గ్రే
- పెర్ల్ సైరన్ బ్లూ
- రెబెల్ రెడ్ మెటాలిక్
- పెర్ల్ ప్రెషియస్ వైట్
ధర: మార్కెట్లో ఈ కొత్త స్కూటర్ DLX వేరియంట్ ధర రూ. 94,442 నుంచి ప్రారంభమవుతుంది. అయితే కీ ఫోబ్, కీలెస్ ఇగ్నిషన్‌తో టాప్ H-స్మార్ట్ వేరియంట్ ధర రూ.97,146గా కంపెనీ నిర్ణయించింది. కొత్త యాక్టివా 125 ధర ప్రస్తుతం ఉన్న మోడల్ కంటే ఎక్కువగా ఉంటుంది. దీని పాత మోడల్‌ను రూ. 80,256 ప్రారంభ ధరతో (ఎక్స్-షోరూమ్) విక్రయిస్తున్నారు. కొత్త స్కూటర్ ధర పెరిగేందుకు ఇందులో ఖరీదైన ఎమిషన్ మానిటరింగ్ టెక్నాలజీ కూడా ఉండటాన్ని మరొక కారణంగా చెప్పొచ్చు.
అమెజాన్ ప్రైమ్ వీడియో యూజర్లకు షాక్.. డివైజ్‌ల వాడకంపై పరిమితి!
కళ్లు చెదిరే లుక్‌లో లగ్జరీ రేంజ్ రోవర్ స్పోర్ట్- రూ.5లక్షలు పెరిగిన ధర- ఇప్పుడు ఈ కారు రేటెంతంటే?
శాంసంగ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్- అధిక ర్యామ్ కెపాసిటీతో 'గెలాక్సీ S25' సిరీస్- రిలీజ్ ఎప్పుడంటే?