యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం కొరటికల్ గ్రామంలో 'మన ఊరు మన బడి' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. బడిలో పిల్లల శాతం తక్కువగా ఉన్నందున ప్రభుత్వం పాఠశాలను మూసివేసేయాలని చూస్తోంది. ఎట్టిపరిస్థితుల్లో పాఠశాలను బతికించుకోవాలని ఆ ఊరి యువత శ్రమదానం చేసి బడిని పరిశుభ్రంగా తయారు చేశారు. గడప గడపకు వెళ్లి ప్రభుత్వ బడి గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సదుపాయాల గురించి మధ్యాహ్న భోజనం పథకం గురించి వివరిస్తున్నారు. ప్రైవేటు బడికిలోకంటే నాణ్యమైన విద్యను అదీ ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తున్నారంటూ తల్లిదండ్రులకు వివరించారు. అవసరమైతే తామే విద్యావాలంటీర్లుగా పనిచేస్తామని తెలిపారు. గ్రామంలోని పెద్దల ఆర్థిక సాయంతో విద్యార్థులకు బెల్టు, టై, షూ, నోటు పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.
ఇవీ చూడండి: వరుణ దేవా.. భారత్-పాక్ మ్యాచ్ రద్దు కాకుండా చూస్కో!