స్వచ్ఛభారత్‌కు ఎంపికైంది:
స్వచ్ఛభారత్ విభాగంలో నర్సింహ తయారు చేసిన యంత్రం ఎంపికై 2014లో అప్పటి కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా రైతునేస్తం పురస్కారం అందుకున్నారు. 2015 మార్చిలో జాతీయ ఇన్నోవేటివ్ ఫౌండేషన్ ఆధ్యర్యంలో రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన ప్రదర్శనలో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి ప్రశంసలు పొందారు.
ఎన్నో అవార్డులు, ప్రశంసలు:
2015లో పల్లెసృజన, నార్మ్ సంయుక్త ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జన్మదినం సందర్భంగా రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ సత్కారం పొందారు. 2016లో నేషనల్ ఇన్నోవేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దిల్లీలోని రాజ్‌భవన్‌లో గాంధియాన్ యంగ్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్ అవార్డును అందుకున్నారు. దేశం మొత్తంలో 10 మందిని ఎంపిక చేయగా... వారిలో తెలంగాణ నుంచి గోదాసు నర్సింహ ఎంపిక కావడం విశేషం. ఇటీవల డెహ్రాడూన్‌లో జరిగిన అఖిలభారత కలెక్టర్‌ల సమావేశంలో ప్రత్యేక ఆహ్వానితునిగా హాజరై గుర్రపు డెక్కను కత్తిరించే యంత్రం తయారికి దారితీసిన పరిస్థితులు, కష్టాలు, సాధించిన విజయం గురించి వివరించాడు.
చదువు అంతంతమాత్రమే కానీ:
గోదాసు నర్సింహది నిరుపేద కుటుంబం. తొమ్మిదేళ్లకే అనారోగ్యంతో తల్లిదండ్రులు మరణించారు. అన్నయ్య వద్ద ఉంటూ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి వరకు చదివాడు. అనంతరం నల్గొండలో పాలిటెక్నిక్ పూర్తిచేసి ఆర్థిక భారంతో చదువుకు స్వస్తి చెప్పాడు. ఇతను స్థానిక మత్స్యకార సంఘంలో సభ్యుడు.
నాబార్డ్ నుంచి ఆర్థిక సహాయం:
మూసీనది నీటివల్ల స్థానిక చెరువులో గుర్రపుడెక్క విపరీతంగా పెరిగేది. స్థానిక మత్స్యకారులు చేపలు పట్టడానికి తీవ్ర ఇబ్బందులు పడేవారు. వలలు తెగిపోయేవి. గుర్రపుడెక్క తొలగించడానికి చెరువులో దిగితే దురద, తరచూ పాము కాట్లకు గురయ్యేవారు. ఈ సమస్యను అధిగమించడానికి ఏదైనా పరిష్కరం కనుగొనాలని భావించి.. రెండేళ్ల పాటు కష్టపడి యంత్రాన్ని రూపొందించాడు. ఇతని ప్రతిభను గుర్తించిన నాబార్డ్ 2.5 లక్షలు ఆర్థిక సహాయం అందించింది.
ప్రభుత్వం చేయూతనిస్తే:
గోదాసు నర్సింహ నూతన యంత్రాలు రూపొందించడానికి నిత్యం పరిశోధనలు చేస్తుంటాడు. అందులో భాగంగానే నీటిని తోడే యంత్రం, గోదాం లిఫ్టర్, రొటెటింగ్ క్రేన్ వంటి యంత్రాలు తయారు చేశాడు. అతి తక్కువ ఖర్చుతో గోదాం లిఫ్టర్ యంత్రం తయారు చేసి మహారాష్ట్రకు ఇచ్చాడు. ఒడిశాలోని బిందుసాగర్ సరస్సులో తీగనాచును తొలగించేందుకు యాంత్రాన్ని తయారు చేసి ఇచ్చాడు. రైతులకు ఉపయోగపడే యంత్రాలు తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ... ఆర్థిక స్థోమత లేదని ప్రభుత్వం చేయూతనిస్తే మరిన్ని ఆవిష్కరణలు చేస్తానని చెబుతున్నాడు ఈ ఇంజినీర్.
ఇదీ చూడండి : దేశవ్యాప్తంగా వైద్యం బంద్- రోగుల ఇక్కట్లు