యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం కొమ్మాయిపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బూడిద యాదగిరి గీతకార్మికుడిగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజూలానే శనివారం మధ్యాహ్నం కల్లు తీసేందుకు వెళ్లిన యాదగిరి... సాయంత్రం వరకు తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబసభ్యులు వెతికారు. తాటిచెట్టు పైనుంచి కింద పడి చనిపోయినట్లు గుర్తించారు. మృతునికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
ఇదీ చూడండి: ‘పాదచారి.. వంతెన’ ఎక్కేదెప్పుడో!