యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురంలో మతిస్థిమితం లేని ఓ వ్యక్తి ఇండిక్యాష్ ఏటీఎం మీద పెట్రోల్ పోసి నిప్పంటించాడు. చెన్నైకి చెందిన మతిస్థిమితం లేని వ్యక్తి హరిద్వార్ నుంచి ఉచిత రైలులో హైదరాబాద్ వచ్చాడు. అక్కడి నుంచి చౌటుప్పల్ వరకు లారీలో వచ్చి కాలినడకన సంస్థాన్ నారాయణపురం చేరుకున్నాడు. కరోనా భయంతో నారాయణపురంలో ఆయనకు ఎవరూ అన్నం పెట్టలేదు. మతిస్థిమితం లేకపోవడం, ఆకలి కావడం వల్ల ఆ వ్యక్తి మనుషుల మీద కోపం వచ్చి బైకులలో పెట్రోల్ తీసి ఏటీఎం మీద పోసి నిప్పంటించాడు. స్థానికులు గమనించి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ఇవీ చూడండి: కరోనా నిర్ధారణ కోసమెళ్తే.. అంటుకునేలా చేస్తున్నారు!