నాలుగోరోజు శ్రీకృష్ణావతారంలో యాదాద్రీశుడు - yadadri festivities news
యాదాద్రి నారసింహుని సన్నిధిలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి వారు శ్రీకృష్ణావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవమూర్తిని ఆలయ అర్చకులు బాలాలయ తిరువీధుల్లో ఊరేగించారు.
యాదాద్రి బ్రహ్మోత్సవాలు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. నాలుగో రోజు ఉదయం స్వామివారు శ్రీకృష్ణావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మురళీకృష్ణుడి అలంకారంలో బాలాలయ తిరువీధుల్లో ఊరేగుతూ గుతూ కనువిందు చేశారు. లోక కల్యాణం కోసం స్వామివారు శ్రీకృష్ణావతారం ఎత్తారని అర్చకులు ఉపదేశించారు.
వజ్రవైఢూర్యాలు, పుష్పాలతో స్వామివారిని సుందరంగా అలంకరించారు. ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఆలయ ఈవో గీతారెడ్డి, ఛైర్మన్ నర్సింహమూర్తి వేడుకల్లో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: తెలంగాణలో పట్టణీకరణ వేగంగా జరుగుతుంది: హరీశ్