లాక్‌డౌన్ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ప్రధాన రహదారులు బోసిపోయాయి. ఉదయం అక్కడక్కడ జనాలు కనిపించిన మధ్యాహ్నం వరకు రోడ్లన్నీ కాలీగా దర్శనమిచ్చాయి. అత్యవసర సేవలకు తప్ప మిగతా అవసరాలకు ప్రజలు రోడ్ల మీదికు రావొద్దని పోలీసులు కోరుతున్నారు.
కిరాణం, మెడికల్ షాపులు, కూరగాయల దుకాణాల వద్ద ప్రజలు గుంపులు గుంపులుగా ఉండకుండా ఇద్దరి మధ్య సామాజిక దూరం పాటించాలని సూచిస్తున్నారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై తిరుగుతోన్న వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.
దుకాణాల్లో నిత్యావసర వస్తువుల నిల్వలు అయిపోతే మున్సిపల్ కార్యాలయంలో అనుమతి తీసుకుని తెచ్చుకోవాలని దుకాణదారులకు యాదగిరిగుట్ట మున్సిపల్ కమిషనర్ సూచించారు. ప్రజలు లాక్‌డౌన్‌కు సహకరించాలని కోరారు.
ఇదీ చూడండి: కరోనా బాధితుల మానసిక స్థితిపై పరిశోధన!