యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకలో ప్రపంచ ఖ్యాతిగాంచిన జైన దేవాలయంలో ఏటా మహావీర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. కాగా ఈ ఏడాది కరోనా నేపథ్యంలో ఉత్సవాలను ఎటువంటి ఆర్భాటాలు లేకుండా నిరాడంబరంగా ముగించారు.
ఈ ఉత్సవానికి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి జైనులు మార్వాడీలు పెద్ద ఎత్తున హాజరవ్వాల్సి ఉండగా.. లాక్డౌన్ కారణంగా భక్తులు లేకుండానే ఆలయ పూజారులు మాత్రమే ఉండి రథోత్సవాన్ని నిర్వహించారు.