కరోనా నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనలతో యాదాద్రిలో ఆలయ ఆదాయ వనరులకు గండి పడింది. కొవిడ్ కారణంగా మార్చి 22 నుంచి సత్యనారాయణ స్వామి వ్రతాలు రద్దయ్యాయి. ఫలితంగా ఉద్యోగుల జీత భత్యాల చెల్లింపులతో ఖజానాపై మోయలేని భారం పడుతోంది.
ఒకవైపు భక్తులచే కాకుండా పరోక్ష పద్ధతిలో ఆన్లైన్ ద్వారా పూజలు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఆలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులకు లఘు దర్శనం ఏర్పాటు చేశారు. శానిటైజేషన్ చర్యలు చేపడుతూ.. థర్మల్ స్క్రీనింగ్ అనంతరం భక్తులను లోనికి అనుమతిస్తున్నారు. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించేలా ఏర్పాటు చేసి, భక్తులకు స్వామి వారి దర్శన సౌకర్యం కల్పిస్తున్నారు.
ఇదీచూడండి: లాక్‌డౌన్‌లో పెరిగిన నిరుద్యోగం... ఉద్యోగాల కోసం వేల మంది నమోదు