యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ప్లవ నామ సంవత్సర పంచాంగాన్ని వేదపండితులు శ్రవణం చేశారు. పాడి, పశుసంపద, పంటలు సుభిక్షంగా పండుతాయని పేర్కొన్నారు. స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం, తులారాశి వారికి స్వామి వారి అద్భుత కటాక్షం ఉందని తెలిపారు. విశ్వమంతటికి రాజైన స్వామివారి ఆశిస్సులతో అన్ని వర్గాల ప్రజలకు శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పారు.
రైతులకు శుభప్రదంగా ఉంటుందని, ఋతుపవనాలు ఆలస్యంగా వచ్చినప్పటికీ వర్షాలు బాగానే కురుస్తాయని అన్నారు. అంతకు ముందు బాలాలయంలో స్వామివారిని ప్రత్యేకంగా పట్టు వస్త్రాలతో అలంకరించారు.
ఇదీ చదవండి: మే తర్వాత కరోనా ఉద్ధృతి తగ్గుతుంది: పంచాంగ శ్రవణం