యాదాద్రి ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా ఇటీవల మహాబలిపురం నుంచి వచ్చిన సింహం విగ్రహాలను ప్రధానాలయ రాజగోపురాలకు ఇరువైపులా పొందుపరిచే పనులు వేగవంతం చేశారు. శుక్రవారం ఉత్తర రాజగోపురానికి రెండు పక్కల ఆ విగ్రహాల పొందిక పూర్తయ్యింది. ప్రధానాలయ నాలుగు రాజగోపురాలకు ఇరువైపులా ఎనిమిది సింహం విగ్రహాలు ఏర్పాటుచేస్తున్నారు. శివాలయంలో నంది విగ్రహాన్ని పీఠంపై పొందుపరిచారు. ప్రధానాలయ ముందు భాగంలో కృష్ణ శిలలతో చేస్తున్న ఫ్లోరింగ్ పనులు తుది దశకు చేరుకున్నాయి.
![Lion statues on either side of the Yadagri temple Dome](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-nlg-82-19-yadadri-vighrahala-pondhika-av-ts10134_19092020151641_1909f_1600508801_771.jpg)
![Lion statues on either side of the Yadagri temple Dome](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-nlg-82-19-yadadri-vighrahala-pondhika-av-ts10134_19092020151641_1909f_1600508801_747.jpg)
ఇవీ చూడండి: డిప్యూటీ తహసీల్దార్ పదోన్నతులపై సర్కార్ కసరత్తు