యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ గ్రంథాలయం ఆధ్వర్యంలో సావిత్రీ బాయి ఫూలే 190వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పలువురు పూలమాల వేసి నివాళులర్పించారు. సావిత్రీ బాయి నేటి తరం మహిళలు, యువతకి ఆదర్శమని గ్రంథాలయ ఛైర్మన్ కోమటి మత్స్యగిరి అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అభివృద్ధి కమిటీ వైస్ ఛైర్మన్ పోలినేని స్వామిరాయుడు, లైబ్రరీ ఇంఛార్జీ చిలకమర్రి బాబుచారి, ఇతరులు జంగ నాగరాజు, సురేష్, ఎం.డి.యూసుఫ్, పిట్టల సంపత్, తదితరులు పాల్గొన్నారు.
నివాళులు సమర్పణ
సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో దేశంలో మొదటి ఉపాధ్యాయురాలు సావిత్రీ బాయి పూలే జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆమె చేసిన కృషి హర్షించతగినదని పలువురు కొనియాడారు. ఎన్నో పాఠశాలలను నెలకొల్పి బడుగు బలహీన వర్గాలకు విద్యను నేర్పించిందని వారు ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుండగాని కవిత, ఎస్ఎస్సీఎస్ ఛైర్మన్ గుడిపాటి సైదులు, మాజీ మండల అధ్యక్షులు తాడికొండ సీతయ్య, గ్రంథాలయ ఛైర్మన్ గోపగాని రమేష్, దేవాలయ కమిటీ ఛైర్మన్ వెంకన్న, డైరెక్టర్లు గోపగాని శ్రీనివాస్, వార్డు సభ్యులు సూరయ్య, రవీందర్, వెంకన్న, తెరాస యువజన నాయకులు వంశీధర్, వెంకన్న, బొజ్జగిరి, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : కేసీఆర్ నగర్.. దేశంలోనే ఎంతో ప్రత్యేకమైనది: హరీశ్‌రావు