ETV Bharat / state

'నష్టపరిహారం చెల్లించండి.. లేదంటే ప్రత్యామ్నాయం చూపండి'

బస్వాపూర్​ రిజర్వాయర్​ భూ నిర్వాసితులకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్​ చేస్తూ.. లప్పనాయక్​ తండావాసులు యాదగిరి గుట్టలో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవో, ఎమ్మార్వోకు వినతి పత్రం అందజేశారు. న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు.

baswapur reservoir
బస్వాపూర్​ రిజర్వాయర్
author img

By

Published : Feb 5, 2021, 7:35 PM IST

బస్వాపూర్ రిజర్వాయర్ కింద ముంపునకు గురవుతున్న లప్పనాయక్ తండా నిర్వాసితులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ.. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో తండావాసులు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఆర్డీవో భూపాల్ రెడ్డి, ఎమ్మార్వో అశోక్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. బస్వాపూర్ రిజర్వాయర్ కింద తండాకు చెందిన 695 ఎకరాల భూమి మునిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ముంపునకు గురవుతున్న భూమికి ప్రభుత్వం ఎకరానికి రూ.15.60 లక్షలు నష్టపరిహారం ఇస్తామని చెప్పి ఏడాది గడుస్తున్నా ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని బాధితులు అన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం విడతలవారీగా కాకుండా ఒకేసారి పరిహారం అందివ్వాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే వేరే స్థలంలో ఇల్లుకు ఇల్లు, భూమికి భూమి ఇవ్వాలని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: విద్యావాలంటీర్లను రెగ్యూలర్ చేయాలి: ఆర్​.కృష్ణయ్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.