ETV Bharat / state

మునుగోడు రిటర్నింగ్​ అధికారి వేటుపై స్పందించిన కేటీఆర్​ - కేంద్ర ఎన్నికల సంఘంపై కేటీఆర్​ ఫైర్​

KTR angry on Election Commission: మునుగోడు ఎన్నిక రిటర్నింగ్​ అధికారిపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేయడాన్ని తెరాస తప్పుపట్టింది. రాజ్యాంగ వ్యవస్థలను భారతీయ జనతా పార్టీ దుర్వినియోగం చేస్తోందని చెప్పడానికి ఇదో ఉదాహరణ అని మంత్రి కేటీఆర్​ తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం, భాజపాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

minister ktr
మంత్రి కేటీఆర్​
author img

By

Published : Oct 20, 2022, 4:35 PM IST

KTR angry on Election Commission: మునుగోడు రాజకీయం రోజురోజుకీ వేడెక్కుతోంది. బ్యాలెట్ పేపర్ వ్యవహారం కాస్త మునుగోడు రిటర్నింగ్​ అధికారి బదిలీకి దారితీసింది. కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్​ తీవ్రంగా స్పందించారు. మునుగోడు రిటర్నింగ్ అధికారి బదిలీ వ్యవహారంలో ఈసీ వ్యవహరించిన తీరు ఆక్షేపణీయమని కేటీఆర్ అన్నారు.

రాజ్యాంగ వ్యవస్థలను భారతీయ జనతా పార్టీ దుర్వినియోగం చేస్తోందని చెప్పడానికి ఇది మరో తార్కాణమని కేటీఆర్ అన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్య స్ఫూర్తికి అద్దం పట్టే విధంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్​పై భాజపా ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. గతంలో తమ అభ్యర్ధన మేరకు 2011లోనే రోడ్డు రోలర్​ గుర్తును తొలగించి.. మళ్లీ ఇప్పుడు తీసుకురావడం ప్రజాస్వామ్యం, ఎన్నికల స్ఫూర్తికి విరుద్ధమని కేటీఆర్ పేర్కొన్నారు. కారును పోలిన గుర్తులతో అయోమయానికి గురిచేసి దొడ్డిదారిన ఓట్లు పొందేందుకు భాజపా కుటిల ప్రయత్నం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు.

స్వేచ్ఛగా ఎన్నికలు జరగాలన్న రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తోందన్నారు. రాజ్యాంగబద్ధ సంస్థలను భారతీయ జనతా పార్టీ తన స్వప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడాన్ని ప్రజలు గమనించాలని కేటీఆర్ కోరారు. నిబంధనల మేరకు పని చేసిన రిటర్నింగ్ అధికారిపై ఎన్నికల కమిషన్​ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎన్నికల కమిషన్ భాజపా నాయకత్వంలో పని చేస్తోందని కేటీఆర్ మరోసారి ఆరోపించారు. మునుగోడులో ఓటమి తప్పదనే భాజపా అడ్డదారులు తొక్కుతోందని కేటీఆర్ ధ్వజమెత్తారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.