ETV Bharat / state

కేసీఆర్​ హిట్లర్​ను మించిపోయారు: కోమటిరెడ్డి

author img

By

Published : Oct 15, 2019, 11:54 PM IST

హుజూర్​నగర్​ ఉపఎన్నికలో గెలిచేందుకు తెరాస అడ్డదారులు తొక్కుతోందని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. ఆర్టీసీని విలీనం చేయాలని కోరితే వారిని తొలగించడం అన్యాయమన్నారు.

కేసీఆర్​ హిట్లర్​ను మించిపోయారు: కోమటిరెడ్డి

హుజూర్​నగర్ ఉపఎన్నికలో ఎలాగైనా గెలవాలని తెరాస దొంగ దారిలో వందల కోట్లు ఖర్చు పెడుతోందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. కేసీఆర్​ గ్రామానికో ఎమ్మెల్యే, 700 మంది ఇంఛార్జులు, 12 మంది మంత్రులను పెట్టి ఒక మహిళను ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్​లో సచివాలయ భవనాలను కూల్చుతామంటే హైకోర్టు చీవాట్లు పెట్టిందన్నారు. మోత్కూరు లాంటి మండల కేంద్రాలను మున్సిపాల్టీలుగా చేసి పేదవారికి పని లేకుండా చేసి వారి పొట్ట కొట్టారని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులు న్యాయమైన కోరికలు కోరితే వారిని తొలగించారని... ఇలాంటిది ఎక్కడ చూడలేదన్నారు. గతంలో నియంత అంటే హిట్లర్​తో పోలిస్తే... నేడు కేసీఆర్ హిట్లర్​ను మించిపోయాడని వెల్లడించారు.

కేసీఆర్​ హిట్లర్​ను మించిపోయారు: కోమటిరెడ్డి

ఇవీ చూడండి: సమ్మెతో ప్రజల ఇబ్బందులను పట్టించుకోరా...?

Intro:Contributor :Anil
Center: Tungaturthi
Dist :Suryapet.
Body:యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో trs దొంగ దారిలో గెలవాలని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గ్రామానికి కో MLA, రాబందుల రజాకర్ల లా 700 మంది ఇన్చార్జులు 12 మంది మంత్రులను పెట్టి హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో లో ఒక మహిళను ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడని,
హుజూర్నగర్ ఎన్నిక క కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీల మధ్య కాదు మూడు లక్షల మంది ఓటర్లు , నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల మధ్య జరిగింది అన్నారు .
హైదరాబాదులో మంచి మంచి బిల్డింగులను కూలగొడుతుంటె హైకోర్టు చివాట్లు పెట్టింది అన్నారు. ఈ మోత్కూరు లాంటి మండల కేంద్రంలను మున్సిపాల్టీ లు గా చేసి పేదవారి పని లేకుండా చేసి వారి పొట్ట కొట్టిందని ఎద్దేవా చేశారు .
ఆర్ టి సి కార్మికులు న్యాయమైన కోరికలు అడుగుతే వారిని డిస్మిస్ చేయడం ఎక్కడ చూడలేదని అన్నారు. గతంలో నియంత అంటె హిట్లర్ తో పోలిస్తే నేడు కేసీఆర్ హిట్లర్ ను మించి పోయాడు అన్నాడు.
పక్క రాష్ట్రం కొత్త రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన రెండు నెలల్లోనే ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేశాడు అన్నారు. ఆరు సంవత్సరాలుగా మోసం చేస్తున్నారని, ఆర్టీసీ కార్మికులు 35 రోజుల ముందు నోటీసులు ఇచ్చి సమ్మెలో పాల్గొన్నారు, ఉద్యోగులు, కార్మికుల తో పెట్టుకున్న ఏము ఖ్యమంత్రి పదవిలో ఎక్కువ కాలం కొనసాగలేదు. అందుకే కేసీఆర్ కు చెబుతున్న వెంటనే ఆర్టిసి ని ప్రభుత్వం లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు..Conclusion:.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.