కేంద్ర జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీని భువనగిరి నియోజకవర్గ పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలోని పలు ప్రాజెక్టులపై మంత్రికి వినతి పత్రం సమర్పించారు. ఎల్‌బీ నగర్ నుంచి మల్కాపూర్ వరకు జాతీయ రహదారి అభివృద్ధి పనులకు రూ. 600కోట్లు మంజూరు చేయగా.. మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
మున్సిపాలిటీ పరిధిలో జాతీయ రహదారి 167లో అలీనగర్ నుంచి మిర్యాలగూడ వరకు జాతీయ రహదారి విస్తరణ పనులు చేపట్టాలని కేంద్ర మంత్రిని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. ఎన్‌హెచ్ 365లో నకిరేకల్ నుంచి తానం చెర్ల వరకు నూతనంగా రోడ్డు విస్తరణ పనులు మంజూరు అయ్యాయని.. అందులో అర్వపల్లి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరినట్లు వివరించారు.
ఓఆర్ఆర్ గౌరెల్లి నుంచి కొత్తగూడె ఎన్‌హెచ్ -30 వరకు నూతనంగా మంజూరైన ప్రాజెక్టుకు జాతీయ రహదారి నెంబర్ కేటాయించి డీపీఆర్‌లను ఆమోదించి నిధులు మంజూరు చేయాలని వినతి పత్రంలో కోరారు.
సానుకూల స్పందన..
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇచ్చిన వినతి పత్రానికి కేంద్ర జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు. వెంటనే ఈ నూతన ప్రాజెక్టులపై నివేదికలు ఇవ్వాలని అధికారులకు కేంద్ర మంత్రి ఆదేశాలు జారీ చేశారు. వారం తరువాత ఈ ప్రాజెక్టులపై చర్చించడానికి రావాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఆహ్వానించారు.
ఇదీ చూడండి: ఒక్కో సినిమా కోసం అక్షయ్‌కు రూ.135 కోట్లు?