భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిశారు. తెలంగాణ గంగ మూసీ నదిని పరిరక్షించాలని కోరారు. నది ప్రక్షాళనపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ట్రిట్‌మెంట్ల ప్లాంట్ల ఏర్పాటు, విరివిరిగా చెట్ల పెంపకం, పరిశ్రమ వ్యర్థాల కట్టడి ద్వారా మూసీని పరిరక్షించాలన్నారు. ఈ విషయాన్ని పార్లమెంట్ జీరో అవర్‌లో లేవనెత్తినా కేంద్రం పట్టించుకోలేదన్నారు.
నవామి గంగ తరహాలో మూసీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. నది పరివాహక ప్రాంతాల్లో భూగర్భ జలాలు కలుషితమై.. ఆ నీటితో పండిన పంటలు తినడం వల్ల ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారని ఎంపీ వివరించారు. మూసీ నీళ్లు తాగడం వల్ల పశువులు మరణిస్తున్నాయని తెలిపారు. 300 నుంచి 500 ఫీట్ల లోతు వరకు మూసీ వల్ల నీరు కలుషితం అవుతోందని చెప్పారు. కేంద్రం తక్షణం స్పందిస్తే.. పర్యావరణానికి, నగరవాసులకు క్షేమకరమని కోమటిరెడ్డి సూచించారు.
ఇదీ చూడండి: 'రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సేవలు కొనసాగుతాయి