తెలంగాణ భాష, యాస శ్వాసగా జీవించి.. ప్రజల గొడవే తన గొడవగా భావించి జీవితాన్ని అంకితం చేసిన 'ప్రజా చైతన్య దీపిక' కాళోజీ నారాయణరావు అని ప్రజా భారతి గౌరవ సలహాదారు సంస్థ పూర్వ ప్రధాన కార్యదర్శి తొగిటి మనోహరాచారి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కాళోజీ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి ప్రజలను చైతన్యం చేసిన మహనీయుడు కాళోజీ అని మనోహరచారి కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రజా భారతి సంస్థ అధ్యక్ష కార్యదర్శులు టి. ఉప్పలయ్య, మర్రి జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: పీఈసెట్లో ప్రతిభ చాటుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీలు