యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం జై కేసారం గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లను ఆపేశారు. చాలా రోజులుగా రైతులు ధాన్యాన్ని తీసుకొచ్చి.. కేంద్రం వద్దే పడిగాపులు కాస్తున్నారు. నెల రోజులు గడుస్తున్నా.. ఇంకా ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు రోడ్డు ఎక్కి ధర్నా నిర్వహించారు. రైతుల రాస్తారొకోతో రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్టలానికి చేరుకొని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. కరోనా సమయంలో ధర్నా చేయొద్దని నచ్చజెప్పి వారిని ఇళ్లకు పంపించారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లపై దృష్టి సారించి రైతులను ఆడుకోవాలని రైతు సంఘం నాయకులు కోరారు.
ఇదీ చదవండి : Lockdown Effect: ఆర్థిక సుడిగుండంలో కూరగాయల రైతు