యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి ఏసీపీ భుజంగరావు.. ఇండియన్ పోలీస్ మెడల్ పథకానికి ఎంపికయ్యారు. కేంద్ర హోంశాఖ, పోలీస్ శాఖకు ఎనలేని సేవలు చేసిన వారి జాబితాను శుక్రవారం విడుదల చేసింది. గత రెండేళ్లుగా భుజంగరావు భువనగిరి ఏసీపీగా పనిచేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బొమ్మలరామారం మండలం హాజీపూర్ అమ్మాయిల వరుస హత్యల కేసు విచారణ అధికారిగా, సాక్ష్యాలు సేకరించడంలో విశేష కృషి చేశారు.
నిందితున్ని శాస్త్రీయ ఆధారాలతో సహా కోర్టు ముందు ప్రవేశపెట్టడంలో భుజంగరావు కీలకంగా వ్యవహరించారు. తక్కువ సమయంలో విచారణను పూర్తి చేశారని.. ఇవే కాక సర్వీస్ మొత్తం ఎనలేని సేవలు చేసినందుకు ఇండియన్ పోలీస్ మెడల్‌తో కేంద్ర హోంశాఖ సత్కరించనుంది. ఈ మెడల్‌కు ఎంపికచేయటం పట్ల ఏసీపీ భుజంగరావు సంతోషం వ్యక్తం చేశారు. అందరి సహకారంతోనే ప్రజలకు సేవ చేయగలుగుతున్నామని ఆయన తెలిపారు.
ఇవీచూడండి: కరోనా కాలంలో సరికొత్తగా పంద్రాగస్టు వేడుకలు