ETV Bharat / state

నల్గొండ, యాదాద్రి జిల్లాల్లో పెరుగుతున్న కేసులు - Increasing Cases in Nalgonda and Yadadri Districts

నల్గొండ, యాదాద్రి జిల్లాల్లో రోజు ఒక కేసు చోప్పున బయటపడుతున్నాయి. నిన్న కూడా ఒక్కో పాజిటివ్​ కేసు ఇరు జిల్లాల్లో నమోదయ్యింది.

Increasing Cases in Nalgonda and Yadadri Districts
నల్గొండ, యాదాద్రి జిల్లాల్లో పెరుగుతున్న కేసులు
author img

By

Published : Jun 5, 2020, 11:33 AM IST

నల్గొండ, యాదాద్రి జిల్లాలో నిన్న కూడా ఒక్కో పాజిటివ్​ కేసు చోప్పున నమోదయ్యాయి. యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించే కానిస్టేబుల్... ఈ నెల 29 నుంచి సెలవులో ఉన్నాడు. జ్వరం లక్షణాలతో స్వయంగా హైదరాబాద్​లో పరీక్షలు చేయించుకోవడం వల్ల పాజిటివ్ తేలింది.

దీనితో ఆ కేసును జీహెచ్ఎంసీ పరిధిలో చేర్చారు. సదరు ఠాణాలో పనిచేస్తున్న మరో ముగ్గురిని హోం క్వారంటైన్ చేశారు. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలంలోనూ... పాజిటివ్ నిర్ధారణయింది. తన భర్తకు అనారోగ్యంగా ఉందని గత నెల 29న గృహిణి... సూర్యాపేట ఆసుపత్రిని ఆశ్రయించింది. కిడ్నీ సమస్య వల్ల డయాలసిస్ చేయాల్సి ఉందంటూ... హైదరాబాద్ వెళ్లాలని సూచించారు అక్కడి వైద్యులు.

భాగ్యనగరానికి తన భర్తను తీసుకెళ్లిన సదరు మహిళ తీవ్ర జ్వరంతో బాధపడుతున్న వేళ... అక్కడి ఆసుపత్రి సిబ్బంది నమూనాలు సేకరించి పంపారు. ఆమెకు కొవిడ్ సోకినట్లు తేలడంతో... బాధితురాలి కుటుంబ సభ్యులు 8 మందిని ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు.

ఇదీ చూడండి: ముఖ్యమంత్రి కేసీఆర్​ కాన్వాయ్​కి ఓవర్​ స్పీడ్​ చలానాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.