యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం దత్తాయపల్లి ఐకేపీ సెంటర్(ikp centre) నిర్వాహకులు తడిసిన బస్తాలలో నుంచి వడ్లను తీసి వేరే బస్తాల్లోకి మార్చకుండా… అలానే లారీల్లో లోడ్ చేసి ఈ నెల 23న సాయంత్రం… బొమ్మల రామారంలోని ఓ మిల్లర్‌కు పంపారు. వడ్లను అన్లోడ్ చేయడం కోసం 24న ఉదయం సంబంధిత మిల్లర్ వచ్చి బస్తాలను చెక్ చేశారు. వడ్లు మొత్తం మొలకెత్తి ఉండడం వల్ల సంబంధిత ఐకేపీ ఏపీఎం ఆఫీసర్‌కు ఫోన్ చేసి చెప్పారు. ఆఫీసర్లు వెళ్లి చెక్ చేయగా వడ్లు మొత్తం మొలకెత్తి కనిపించాయి. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం రెండు రోజుల పాటు మిల్లర్‌తో సంప్రదింపులు జరిపినా ఫలితం లేకుండా పోయింది.
దీంతో తుర్కపల్లి మండలం దత్తాయపల్లిలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రానికి(ikp centre) మిల్లర్ నుంచి వడ్లు రిటర్న్ వచ్చాయి. లారీలో ఉన్న దాదాపు 200 క్వింటాళ్ల వడ్లు(500 బస్తాలు) తడిసి మొలకెత్తాయి. ఈ సందర్భంగా యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్(collector anitha ramachandran) ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం(ikp centre) లో ఉన్న ధాన్యం బస్తాలను పరిశీలించి… అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఇదీ చూడండి: Humanity: కన్న తల్లిలా.. కడుపు నింపుతోన్న టీచరమ్మ!