ETV Bharat / state

హత్యకు దారితీసిన భార్యాభర్తల గొడవ - husband

భువనగిరి పట్టణంలోని ఓ ఇంట విషాదం నెలకొంది. భార్యాభర్తల మధ్య వివాదం ప్రాణాల మీదకు తెచ్చింది. హనుమాన్‌ వాడకు చెందిన నాగరాజు భార్య కవితపై గ్రానైట్‌ రాయితో తలపై బలంగా కొట్టగా అక్కడికక్కడే మరణించింది.

హత్యకు దారితీసిన భార్య భర్తల గొడవ
author img

By

Published : Apr 30, 2019, 1:40 PM IST

Updated : Apr 30, 2019, 11:10 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి పట్టణంలో భార్యాభర్తల మధ్య గొడవ హత్యకు దారితీసింది. పట్టణంలోని హనుమాన్ వాడకు చెందిన నాగరాజుకు యాదగిరిగుట్ట మండలం దాతరుపల్లికి చెందిన కవితతో 10 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. రోజు కూలి పనులు చేసుకుని జీవించే వీరి మధ్య తరచు గొడవలు జరిగేవని బంధువులు తెలిపారు. వారం రోజుల క్రితం కవితపై కిరోసిన్ పోసి చంపాలని చూడగా తపించుకున్న కవిత తన తల్లిగారి ఇంటికి వెళ్ళింది. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టి ఇంటికి పంపించారు. అయినా నాగరాజు మాత్రం మారలేదు. సోమవారం రాత్రి భార్య తలపై గ్రానైట్​ రాయితో బలంగా కొట్టాడు. చుట్టుపక్కలవారు ఆసుపత్రికి తరలించే లోపే కవిత మరణించింది.

కేసు నమోదు చేసుకున్న పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న హంతకుడి కోసం గాలిస్తున్నారు.

హత్యకు దారితీసిన భార్యాభర్తల గొడవ

ఇవీ చూడండి:సోహెల్​ది హత్య కాదు.. ఆత్మహత్యే

TG_NLG_61_30_BHARYAHATYA_AB_C14 రిపోర్టర్: శ్రీపాద సతీష్ సెంటర్: భువనగిరి సెల్: 8096621425 జిల్లా: యాదాద్రి భువనగిరి యాంకర్: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో భార్య,భర్తల మధ్య గొడవ భార్య హత్యకు దారితీసింది. పట్టణంలోని హనుమాన్ వాడకు చెందిన నాగరాజుకు యాదగిరిగుట్ట మండలం దాతరుపల్లి కి చెందిన కవితకు 10ఏండ్ల క్రితం వివాహం జగింది. వీరికి ఒక పాపా బాబు ఉన్నారు. రోజు కూలి పనులు చెలుకొని జీవించే వీరి మధ్య తరచు గొడవలు జరిగేవని బంధువులు తెలిపారు. గత వారం క్రితం కవిత పై కిరోసిన్ పోసి చంపాలని చూడగా తపించుకున్న కవిత తన తల్లిగారి ఇంటికి వెళ్ళింది పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టి ఇంటికి పంపిస్తే నిన్న రాత్రి ఈ ఘాతుకనికి ఒడిగట్టడాని కవిత మేనమామ బొందయ్య తెలిపారు. నిన్న అర్ధరాత్రి గ్రనేట్ రాయి తో కవిత తలపై బలంగా కొట్టాడని.. గమనించిన కొడుకు ఇరుగుపొరుగు వారికి తెలుపగ ఆసుపత్రికి తరలించే లోపు కవిత మరణించినట్లు ఆయన తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు నాగరాజు పరారీలో ఉన్నాడు.
Last Updated : Apr 30, 2019, 11:10 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.