కరోనా మహమ్మారి వ్యాప్తితో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అధికారులు.. శాశ్వత పూజలను నిలిపివేశారు. భక్తులు ఎంతో నమ్మకంతో చేయించే పూజలను పునరుద్ధరించాలని కోరుతూ హిందూ దేవాలయ పరిరక్షణ సమితి నాయకులు ఆలయ అధికారులకు వినతిపత్రం అందజేశారు.
మొక్కుల చెల్లింపుల్లో భాగంగా.. శాశ్వత పూజలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోందని పరిరక్షణ సమితి అధ్యక్షుడు రవీందర్ రెడ్డి తెలిపారు. వందల ఏళ్లుగా వస్తోన్న ఈ సంప్రదాయానికి స్వస్తి పలికేలా ఆలయ నిర్వాహకులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. భక్తుల మనోభావాలు గౌరవిస్తూ తిరిగి శాశ్వత పూజలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
- ఇవీ చూడండి: ఒకే పార్టీకి పట్టం.. ఎల్బీనగర్ ఓటర్ల నైజం