ETV Bharat / state

గుట్ట మున్సిపల్​ కమిషనర్​కు హైకోర్టు నోటీసులు..! - High Court latest news

యాదాద్రి మున్సిపల్​ కమిషనర్ రజిత​కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కరెంటు మీటరుకు ఎన్ఓసీ ఎలా ఇస్తారనే వివాదంపై న్యాయస్థానం నోటీసులు ఇచ్చినట్లు సమాచారం

గుట్ట మున్సిపల్​ కమిషనర్​కు హైకోర్టు నోటిసులు..

author img

By

Published : Oct 9, 2020, 4:09 PM IST

మున్సిపల్ కమిషనర్ జంపాల రజితకు హైకోర్టు గురువారం నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. యాదగిరిగుట్ట పట్టణంలోని సర్వే నంబర్ 19/రూ లో ఫ్లాటు విషయమై ఇద్దరు వ్యక్తుల వద్ద కొంతకాలంగా వివాదం నడుస్తోంది. సదరు వ్యక్తులు కోర్టులో కేసు వేశారు. కానీ ఓ వ్యక్తికి ఆ ఫ్లాట్​లో ఇటీవల మున్సిపల్ కమిషనర్ కరెంట్ మీటర్ బిగించుకునేందుకు ఎన్ఓసీ ఇచ్చినట్లు తెలిసింది.

ప్లాట్​పై కోర్టులో కేసు నడుస్తుండగా మరో వ్యక్తికి కరెంటు మీటరుకు ఎన్ఓసీ ఎలా ఇస్తారని మరో వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు మున్సిపల్ కమిషనర్​కు గురువారం నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.

హైకోర్టు చేరిన గుండ్లపల్లి ప్లాట్ వివాదం

యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని గుండ్లపల్లిలోని సర్వే నంబరు 19 /రూ లో ఫ్లాట్ నంబర్ 2లో మల్లాపురం గ్రామానికి చెందిన కర్రె వెంకటయ్యకు చెందినదని ఆ ప్లాటుకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని యాదగిరిగుట్ట మున్సిపాలిటీ కమిషనర్ గత నెల ఏడో తేదీన ధ్రువీకరణ పత్రం జారీ చేశారు. ఇది చట్టవిరుద్ధమని ఆ ప్లాటు తమకు చెందినదని పల్లె పాటి సత్యనారాయణ సతీమణి సుగుణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

భూ వివాదంపై 2008లోనే భువనగిరి సివిల్ కోర్టులో కేసు వేశారు. కోర్టు పిటిషన్ దారులకు అనుకూలంగా ఇంజక్షన్ ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వులు ఇంకా అమల్లో ఉన్నప్పటికీ కర్రి వెంకటయ్యకు అనుకూలంగా ధ్రువీకరణ పత్రం జారీ చేయడం చెల్లదని హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. బాధ్యులైన విద్యుత్ అధికారులు పిటిషన్ దారులు విద్యుత్ కనెక్షన్ ఇవ్వవద్దని గతంలో ఇచ్చిన లీగల్ నోటీసులు పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించింది.

ఇదీ చూడండి: ఏకపక్షంగా కాంట్రాక్టు రద్దు చేయడం సరికాదు: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.