Hero Srikanth Visited Yadadri: యాదాద్రి ఆలయ నిర్మాణం అత్యాద్భుతంగా ఉందన్నారు నటుడు శ్రీకాంత్. ఓ ప్రైవేటు కార్యక్రమానికి వచ్చిన శ్రీకాంత్.. లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని.. ప్రత్యేక పూజలు చేశారు. శ్రీకాంత్తో పాటు డైరెక్టర్ వీరభద్రంకు ఆర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనాలిచ్చారు. తీర్థప్రసాదాలు అందించారు. స్వామి వారి దర్శనం అనంతరం శ్రీకాంత్.. యాదాద్రి ఆలయ నూతన కట్టడాన్ని వీక్షించారు. ఆలయంలో కలియతిరుగుతూ.. శిల్పకళను పరిశీలించారు. ఇంత గొప్పగా ఆలయ నిర్మాణాన్ని సీఎం కేసీఆర్ చేపట్టటం సంతోషదగ్గ విషయమని అభిప్రాయపడ్డారు.
![Hero Srikanth Visited Yadadri temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-nlg-81-20-yadadri-cini-hero-srikanth-pujallu-av-ts10134_20022022124323_2002f_1645341203_382.jpg)
"యాదాద్రి ఆలయాన్ని చాలా కాలం తర్వాత సందర్శించుకున్నా. నూతన ఆలయంలోకి వస్తుంటే.. స్వర్గంలోకి అడుగుపెట్టినట్టు అనిపిస్తోంది. ఒక మహా యజ్ఞంలా తీసుకుని సీఎం కేసీఆర్.. యాదాద్రిని ఇంత అద్భుతంగా నిర్మించడం చాలా సంతోషంగా ఉంది. ఆలయ ప్రారంభం తరువాత ఇంకా అద్భుతంగా ఉంటుంది. రాత్రి సమయంలో విద్యుత్ కాంతులతో యాదాద్రి ఆలయం ప్రకాశవంతంగా ఉంటుందనిపిస్తోంది. ప్రజలంతా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామి వారిని కోరుకున్నా." - శ్రీకాంత్, నటుడు
యాదాద్రి నూతన నిర్మాణాన్ని వీక్షించిన అనంతం..
ఇదీ చూడండి: