హైదరాబాద్లో మరోసారి లాక్డౌన్ విధిస్తారన్న ఉహాగానాల నేపథ్యంలో సొంతూళ్లకు పయనమయ్యే వారి సంఖ్య పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరాయి. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద మంగళవారం సాయంత్రం రద్దీ నెలకొంది. రోజూ వెళ్లే వాహనాల కంటే.. వెయ్యికి పైగా వాహనాలు టోల్ ప్లాజా దాటినట్లు సిబ్బంది చెబుతున్నారు.
ఫాస్టాగ్ మార్గాల్లో రద్దీ లేకున్నా.. టికెట్ కౌంటర్ వరుసలో వాహనాలు బారులు తీరాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికే పెద్దఎత్తున కరోనా కేసులు బయటపడుతున్న దృష్ట్యా.. స్వగ్రామాలకు వెళ్లేవారితో వైరస్ వ్యాప్తి అధికమయ్యే అవకాశం అందని ఆరోగ్య శాఖ వర్గాలు భావిస్తున్నాయి.