ETV Bharat / state

కొనసాగుతోన్న నారసింహుని పవిత్రోత్సవాలు - పవిత్రోత్సవాలు

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహుని సన్నిధిలో రెండో రోజు పవిత్రోత్సవాలు ఘనంగా జరిగాయి. ఏకాదశి సందర్భంగా స్వామికి లక్ష పుష్పార్చన నిర్వహించారు. స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు.

కొనసాగుతోన్న నారసింహుని పవిత్రోత్సవాలు
author img

By

Published : Aug 11, 2019, 5:26 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో పవిత్రోత్సవాలు రెండో రోజు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా స్వామి వారికి నవ కళాశాభిషేకం, లఘు పూర్ణాహుతి, ప్రబంధ పారాయణ నిర్వహించారు. పవిత్రోత్సవాల సందర్భంగా నేడు, రేపు స్వామి వారి కల్యాణాలు, సుదర్శన హోమాలు రద్దు చేశారు. ఈ నెల 13 నుంచి అర్జిత సేవలను పునరుద్ధరించనున్నారు. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకోని నారసింహునికి లక్షపుష్పార్చన నిర్వహించారు.

ఆదివారం కావడం వల్ల స్వామివారి సన్నిధికి భక్తులు పోటెత్తారు. సత్యనారాయణ మండలం, కల్యాణకట్ట, పుష్కరిణి భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సర్వదర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

కొనసాగుతోన్న నారసింహుని పవిత్రోత్సవాలు

ఇవీ చూడండి: 108 చీరలతో ఏడుపాయల అమ్మవారికి అలంకరణ

Intro:Tg_nlg_186_11_2nd_day__pavitrsthvalu_TS10134

యాదాద్రి భువనగిరి..
సెంటర్..యాదగిరిగుట్ట..
రిపోర్టర్..చంద్రశేఖర్..ఆలేరు సెగ్మెంట్,9177863630

తేదీ:11:8:19

వాయిస్: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో పవిత్రోత్సవాలు రెండోరోజు ఘనంగా నిర్వహించారు ఆలయ అర్చకులు. రెండోరోజు పవిత్రోత్సవాల్లో భాగంగా స్వామి వారికి ఉదయం నవకళాశాభిషేకం,నిత్యహోమలు,నిత్యా లఘుపూర్ణాహుతి,వేద,ఇతిహాస,పురాణం,ప్రబంధ పారాయణలు నిర్వహించారు ఆలయ అర్చకులు..నిన్న స్వస్తివాచనం తో ప్రారంభమైన పవిత్రోత్సవాలు రేపు పూర్ణాహుతి,పవిత్ర మాలల ధారణతో ముగియనున్నాయి... పవిత్రోత్సవాల సందర్భంగా నేడు,రేపు రెండు రోజులపాటు స్వామివారికి జరిగే నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, సుదర్శన నారసింహ హోమం రద్దు చేశారు ఆలయ అధికారులు. పవిత్రోత్సవాల ముగింపు అనంతరం తిరిగి పదమూడవ తేదీ నుంచి భక్తులచే జరపబడే ఆర్జిత సేవలు పునరుద్ధరించనున్నారు. ఏడాది పాటు ఆలయంలో జరిగిన పూజల్లో తెలిసీ తెలియక ఏవైనా తప్పులు జరిగుంటే, ఆ తప్పులు చెరిగిపోవడం కోసం శాస్త్రబద్ధంగా ప్రతి సంవత్సరం పవిత్రోత్సవాలను నిర్వహిస్తామన్నారు ఆలయ అర్చకులు. తెలిసీ తెలియక చేసిన తప్పులను మన్నించి, మాపై కరుణా కటాక్షాలు చూపించాలని కోరుతూ స్వామివారికి పవిత్రోత్సవ ఉత్సవాలు జరుపుతామన్నారు ఆలయ అర్చకులు.యాదాద్రి క్షేత్రంలో పవిత్రోత్సవాలను శాస్త్రబద్దంగా వైభవోపేతంగా నిర్వహిస్తామని, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు.

బైట్:1.నల్లందిగల్. లక్ష్మీనరసింహ చార్యులు(ఆలయ ప్రధానార్చకులు)Body:Tg_nlg_186_11_2nd_day__pavitrsthvalu_TS10134Conclusion:......
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.