హనుమాన్ జయంతిని పురస్కరించుకుని తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి కొండపైన పుష్కరిణి వద్ద గల ఆంజనేయ స్వామి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆంజనేయ స్వామి వారికి లక్ష తమలపాకులతో అర్చన చేశారు. 128 సార్లు నీటితో అభిషేకం, స్వామి వారికి వడమాల సమర్పణ, నివేదన లాంటి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం హిందు దేవాలయాల పరిరక్షణ సమితి హనుమాన్ శోభయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థానికులు, భక్తులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఇవీ చూడండి: 'విభజన హామీల అమలుకు కృషి చేయండి'