రాష్ట్ర మహిళాసంఘం కార్యదర్శి సృజన, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు నెరేళ్ల శారద, పీఓడబ్ల్యూ సంధ్య, కల్లూరి రామచంద్రారెడ్డిలు హాజీపూర్ గ్రామంలోని బాధితకుటుంబాలను కలిశారు. వారికి న్యాయం జరగకపోతే ప్రగతిభవన్ని ముట్టడిస్తామని తెలిపారు. ఒక మానవ మృగం వల్ల చదువుకొని మంచి భవిష్యత్తు ఉండాల్సిన అమ్మాయిలు బలయ్యారని శారద ఆవేదన చెందారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని మండిపడ్డారు. గ్రామస్థుల కోరిక మేరకు గ్రామంలోనే హంతకుడిని ఉరి తీయాలని కోరారు. షీ టీం పెట్టి సెల్ఫీ దిగిన కవితమ్మ... ఆడపిల్లలు చనిపోతే ఎందుకు రాలేదని ప్రశ్నించారు.
హైదరాబాద్కు 28కిలోమీటర్ల దూరంలో ఉన్నా హాజీపూర్ గ్రామంలో ఉండే విద్యార్థులు నాలుగు కిలోమీటర్లు దూరం నడుచుకుంటూ పోవాల్సిన పరిస్థితి వచ్చిందని సంధ్య ఆవేదన చెందారు. పోలీసులు మొదటి అమ్మాయి తప్పిపోయినప్పుడే దర్యాప్తు చేస్తే ఇన్ని సంఘటనలు జరిగేవి కాదని తెలిపారు.