యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట, ఆలేరు, రాజపేట, తుర్కపల్లి, మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. యాదాద్రి కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్డులో విద్యుత్ స్తంభాలు, బారీ చెట్లు నేలకూలాయి. యాదగిరిగుట్ట పట్టణంలో ఇళ్ల ముందు, కాలనీల్లో కంకర కుప్పలుగా పేరుకుపోయిన వడగండ్లు వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
సుమారు గంట పాటు కురిసిన వాన కారణంగా పంట పొలాల్లోకి నీరు చేరి రైతులకు తీవ్ర నష్టం జరిగింది.
ఇవీ చదవండి: కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు