యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలో గల పాఠశాల ఆవరణలో దొంతిరి నర్సింహా రెడ్డి సహకారంతో మండలంలోని రేషన్‌కార్డు లేని పేద కుటుంబాలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ కిమ్యానాయక్ ముఖ్యఅతిథిగా హాజరై పేదలకు సరకులు అందించారు. లాక్డౌన్ సమయంలో సరకులు పంపిణీ చేసిన దొంతిరి నర్సింహా రెడ్డికి, దీనికోసం కృషి చేసిన తహసీల్దార్ జ్యోతికి అదనపు కలెక్టర్ అభినందనలు తెలియజేశారు.
దేశంలో కరోనా కేసులు లక్ష దాటిపోయాయని, వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వాలు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాయని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని అదనపు కలెక్టర్ కిమ్యానాయక్ సూచించారు. గ్రామాలకు వచ్చిన వలస కార్మికులపై వివక్ష చూపొద్దన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ యాదగిరి, తహసీల్దార్ జ్యోతి, ఎంపీడీవో వీరస్వామి, దాత దొంతిరి నర్సింహా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన కాంగ్రెస్ శ్రేణులు