యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం ధర్మారంలో 70 మంది పేద వృద్ధ మహిళలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన స్వచ్ఛంద సేవకురాలు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా డైరెక్టర్ గోవిందు థెరిసా భర్త బండారు రామమూర్తి 34వ వర్ధంతి సందర్భంగా... ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ఛైర్మన్ డాక్టర్ జి.లక్ష్మీనరసింహ రెడ్డి... థెరిసా సేవలను అభినందించారు. భవిష్యత్లో మరిన్ని కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మోత్కూరు రెడ్ క్రాస్ కార్యదర్శి ఎస్ఎన్ చారి, ఎస్సై మహేశ్వర్, స్థానికులు గంగులు, ధన్సింగ్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: భారీ పెట్రోలియం ప్రాజెక్టులు ప్రారంభించిన మోదీ