ఖమ్మం జిల్లాలో సంకల్ప సభకు వెళ్తున్న వైఎస్ షర్మిలకు అడుగడుగునా అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో అభిమానులు ఘనస్వాగతం పలికారు. వందల సంఖ్యలో వాహనాల కాన్వాయ్‌తో హైదరాబాద్ నుంచి బయల్దేరిన షర్మిలకు అభిమానులు పూలమాలలు వేస్తూ.. శాలువాలతో సన్మానించారు.
పెద్ద సంఖ్యలో వేచి ఉన్న అభిమానులు టపాకాయలు కాలుస్తూ నినాదాలు చేశారు. కారులో నుంచి బయటికి వచ్చి అభివాదం చేస్తూ వారిని షర్మిల ఉత్సాహపరిచారు. జాతీయ రహదారిపై కొద్దిసేపు సందడి ఏర్పడింది.
ఇదీ చదవండి: ఖమ్మం సంకల్ప సభకు బయలుదేరిన వైఎస్ షర్మిల