యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు, మోత్కూరు, గుండాల మండలాల్లో సుమారు అరగంట పాటు ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. గాలులు బలంగా వీయడం వల్ల వృక్షాలు నేలకొరిగాయి.
ఆత్మకూరు మండలంలోని కొరటికల్ గ్రామంలో ఇళ్ల పైకప్పులు లేచిపోయినాయి. మార్కెట్ యార్డ్లో ధాన్యం తడిసిముద్దయింది. గుండాల మండలంలోని మామిడి తోటల్లో మామిడి కాయలు నేల రాలాయి.
ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముకునే సమయంలో నీటిపాలైందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకున్నారు.